"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "

"చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె
మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి
అంతలోనే సిగ్గుతో హోయలుపోయి
చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా
నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె
పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది"
చినుకు కోసం పడిగాపులు పడి
చినుకుకు చేమటధార చేర్చి
మట్టిని బంగారం చేసి
ఆ బంగారాన్ని అయినకాడికమ్మి
తన ఖర్మ ఇంతేననుకుంటూ
మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు