"చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె
మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి
అంతలోనే సిగ్గుతో హోయలుపోయి
చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా
నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె
పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది"








Recent Comments