ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఇంకా రాలేదు కాని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే కేంద్రంలో మంచి రాష్ట్రం విషయం లో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ మంచి చెడు ఎందుకు అన్నానంటే అర్ధం కేంద్రంలో సుస్థిర -ప్రభుత్వం రాష్ట్రం లో మధ్యంతరానికి అవకాసం వున్నా ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, అందువల్ల నష్టమో లాభమో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే జరిగిన నష్టం కంటే మరింత నష్టం జరగబోతుందా? లాభం ఎటూ జరగదని తెలుసు
.సంతోషకరమయిన విషయం జయ ప్రకాష్ నారాయణన్ గారు అసెంబ్లీ లో అడుగు పెట్టారు, కనీసం అసెంబ్లీ సమావేశాలలో కొంతసమయమయినా ఉపయోగకరమయిన చర్చ జరుగుతుందని ఆశించవచ్చు.








Recent Comments