ఎన్నికలు అయిపోయ్యాయి గోల్లుగిల్లుకోవడం చేతగాక ఎన్నికల తరువాత పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాని నాది ఒక చిన్న సందేహం, ప్రజాస్వామ్యం లో ఎన్నికల తరువాత పొత్తులు సమ్మతమేనా? మిగతా అన్ని పార్టీ ల మీద వాటి నాయకుల మీద చిరాకేసి నేను లోకసత్తా కు ఓటు వేసాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్లి ఈ కాంగ్రెస్ తోనో లేక తెలుగు దేశం తోనో పొత్తు పెట్టుకొంటే నేను వేసిన ఓటు తప్పుగా ఉపయోగించుకున్నట్టేగా?
Find more like this: Telugu News, politics, telugu , politics, telugu, Telugu News








2 comments Add your comment »
Get updates when new comments are added. Subscribe to the comments RSS Feed
May 8, 2009
17:03
పొత్తుపెట్టుకోవడం తప్పుకాదు. ప్రజాస్వామ్వమంటే ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకోవడమేకదా. ఉదాహరణకు మీకు రాజ్యాధికారం వస్తే మీరు ఏఏ పనులు చేయాలనుకుంటారో, అవే అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు మీకు అప్పుడప్పుడూ తారసపడతారు. అటువంటి వారిని మీరు ఫాలో కావడమే రాజకీయమంటే. క్రింది స్తాయినుండి పైవరకూ మనమే ఆలోచించలేము. మనకు నచ్చిన విధానాలు అనుసరించే గ్రూపు నాయకునికే ఆబాధ్యత వదిలేయాలి. మన సపోర్టు పార్టీలకు ఉండకూడదు. లైక్ మైండెడ్ గ్రూపు వరకూ ఉంటే చాలు.
May 8, 2009
19:48
నేను గ్రూప్ లు కట్టడానికి కాని గ్రూపులకు కాని వ్యతిరేకం కాదు, కానీ ఇవన్ని ఎన్నికలకు ముందే జరగాలి అలచేయ్యటం వల్ల కనీసం ఓటు వేసే జనానికి ఎవరికి ఓటే చేస్తున్నారో ఏ గ్రూప్ కి ఓటే చేస్తున్నారో తెలుస్తుందన్నదే నా అభిప్రాయం