Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

అక్షర కుసుమాలు -1

నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”

ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో పాటు ఓ సందేహం కూడా,నేను చదివే చాలామంది రచయితల్లో సంవత్సరాల వ్యాసాంగం కొనసాగించిన వారు ఉన్నారు.వారి శైలిలో పదాల కుర్పులే వచ్చాయి అని వెతకడానికి ప్రయథ్నిన్చను.ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చదువుతున్న” మధురాంతకం రాజారాం” కథల సంపుటీతో మొదలు పెట్టాను .ఈ నాలుగు కథల సంపుటాలు ఆయన 45 ఏళ్లు వ్రాసిన కథలతో కూర్చినవి. ప్రయత్న లోపం లేకుండా ఆయన శైలిలో 45 ఏళ్లలో వచ్చిన మార్పును వెలికి తీయడానికి ప్రయత్నించాను,పెద్దగా లాభం లేకపోయింది ఎందుకంటే పెద్దగా శైలిలో మార్పు లేదు,మొదటినుండి కథ చెప్పే విధానంలో అదే సౌమ్యత,అదే భవమ్.అప్పుదు అనిపించింది మంచి రచయితలు అందరు వారి శైలిని కొనసాగించడం తోనే గొప్పవారయ్యారేమోనని.

మీరు పుస్తక ప్రియులు అయినట్లయితే ఈ క్రింద ఉన్న సైటులో పుస్తకాల మార్పిడికి ఓ మంచి అవకాశం కలిపిద్దామని ప్రయత్నించాను.

http://bookexchange.indianhippy.com/

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

1 comment to అక్షర కుసుమాలు -1

  • [...] అక్షర కుసుమాలు -1 అక్షర కుసుమాలు -2 Permalink – Comments RSS Feed – Post a comment – Trackback URL – Share on Twitter Related Posts అక్షర కుసుమాలు -2 అక్షర కుసుమాలు -1 జీవితం తెలుగు దేశం డబ్బు పంచే కార్యక్రమమం పై నా అభిప్రాయం ప్రేమ [...]

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>