ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే వాళ్ల రూపాయల కోసం ఆశ పడటం. ఆ ఆశతో ఇక్కడ మెడలు మిద్దేలు కొనేసి వాటి కోసం అప్పులు చేసి వాటిని నెలనెలా ఓ 20 సవత్సరాలకి సరిపోను తీర్చుకొంటూ ఈలోపల ఆ అమెరికాలో ఉన్నవాడు సుఖం గా ఉండి మనకి నెలనెలా డబ్బులు పంపుతూ ఉండాలని మనకి తెలిసిన తెలియని కోటిన్నొక్క దేవుళ్ళాకి మొక్కుతూ సుఖం గా బతుకుతున్నామని కనిపిస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తూ ఏమిటో మరి ఈ జీవితం.








బాగానే వుంది, కాని లేనోడు లేదని ఏడిస్తే ఉన్నోడు ఉందని ఏడవడమేమిటో,
అంటే మీకు ఏమి కావాలో మీకు తెలీటంలేదు,
ఆశయాలు లక్ష్యాలు ఏర్పరచుకోండి….
ఏమంటారు
తెలుగోడా వ్యాఖ్యకు ధన్యవాదాలు ఉచిసలహాకు కూడా ధన్యవాదాలే. ఏదో చిరాకేసి ఆమెరికాలో వున్న బాసు మీద కోపం వచ్చేసి సరదాగా ఏదో రాసేస్తే మరీ సీరియుస్ (తెలుగు పధం ఏంటో) గా తీసుకున్నత్తున్నారు
మరీ అంతగా ఆలోచిన్చకన్దే