ఇప్పుడు ప్రతిరోజు తెలుగు పత్రిక తెరవగానే కనిపించే విషయం పలానా రాజకీయ నాయకుడు పలానా రాజకీయ పార్టీ మీకు ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము అనే విషయం కనిపిస్తుంది ఉచితంగా ఇచ్చేవాటిలో తినే తిండి నుండి వుండే ఇల్లు ఇంట్లో పెట్టుకొనే టీవీ వరకు ఏదైనా కావచ్చు. ఎ ఒక్కరు మేము గెలిస్తే మీ అంతట బ్రతకడానికి కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం లేదు, రాజకీయ పార్టీలకు జనం సోమరిపోతులై తమపై ఆదారపడి తామూ చేసే అవినీతి భరిస్తూ వాళ్ళు ఆశ చూపే బిక్షకు అర్రులు చాస్తున్న వాళ్ళగానే కావలి. అలా కాకుండా జనానికి అవకాశాలు కల్పించి కష్టపడే ఆలోచించే అవసరం అవకాశం కల్పించి చైతన్యం తీసుకు వస్తే తమకు తమ పార్టీలకు మనుగడ కష్టమవుతుందని నమ్మకం వాళ్ళకు తెలిసిన నిజం.
ఈనాడు పల్లెలకు వెళ్లి చూడండి ఎంత డబ్బు ఇస్తామన్నా ఓ రోజు పొలం పని చెయ్యడానికి మనిషి దొరకడు ఒక వేళ దొరికినా ఏదో పని చేశామనిపించుకోనేవాళ్ళు తప్ప, పనిలో ఒడుపు తెలియదు తెలిసినా చేసి ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మారుతున్న ఈ పరిస్థితులకు రాజకీయులు వారు చేసే రాజకీయాలు ఒక్కటే కారణం కాదు గానీ ఇది ఒక ప్రధాన కారణం. నాకు తెలిసి ప్రజాస్వామ్యం లో జనానికి అన్నీ ఉచితంగా ఇవ్వాలని గాని ఇవ్వమని గానీ ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఓ వేళ ఇచ్చినా అసహాయులకు నిజంగా అవసరం లో ఉన్న వాళ్ళకు ఇచ్చి ఆదుకోవలసిన బాధ్యతతో ఇచ్చి ఆదుకోవాలి గానీ ఇలా ఓట్ల కోసం జనాన్ని సోమరి పోతులుగా తాయారు చేస్తూ నాశనం చేస్తున్న ఈ అధికారం మాత్రమె అవసరంగా అవధిగా వున్న ఈ రాజకీయాలు ఎన్ని రొజులో.








Recent Comments