స్వేచ్చ పొంది అరవై ఏళ్ళు అయిందని
గుండెలు విరుచుకొని నవ్వు పూసుకొని
వెలిగిపొతున్నామని మనమే గొప్పని
డాబుచేసి డప్పుకొట్టుకొంటిమి
ఏమి సాదించాం అసలు?
ఎటుచూసినా బానిసత్వమే
భావ దాస్యం జెండాల వాళ్ళది
వాటికే దాసులు పీఠం ఎక్కినవారు
వారి తప్పులను అనుభవిస్తూ జనం
ఎవరి కోసం ఈ ఎదురు చూపులు?
ఎవరు వచ్చి ఉద్దరిస్తారని?
మనకు మనం చేసుకున్న మొసంతో
అరవై ఏళ్ళూ గడిపేసాం
మేల్కోవాల్సిన సమయం వచ్చింది
ముందుకురకాల్సిన సమయం వచ్చేసింది
నేను సిద్దం, సిద్దమా మరి మీరంతా








స్వామియే ఐ శరణమయ్యప్పా! ఇది ఏమి రచనప్పా! నిండా మోసంగా ఉన్నాది.
emi ayindappa nachchaleda?
మీ ఆలోచనలు మాటల రూపంలో బావున్నాయి.నేను సిద్దం అన్నారుగా వాటికి కార్యరూపం ఇవ్వగలరా????(అంటే ప్రాస కోసం వ్రాసారేమో అని అడిగా…)