చిరునవ్వు సింగారించుకొని
కనులతో ఊసులాడుతూ
నేను కవినని నాకు గుర్తుచేసి
ఏదో ఒకటి రాయమని
ఉత్సాహం నింపి కలం చేతికిచ్చి
చటుక్కున మయమయ్యింది…
ఎవరది నన్ను నిద్ర లేపింది?
అరే ఎవరది నాకల చిదిమేసింది?
ఏమి రాయను మరి ఇప్పుడు నేను?
కలలో ఉండి నిజాన్ని మరువనా?
నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా?








చాలా బాగుంది.కలలు కంటూ నిజం లో వాటిని సాకారం చేసుకోండి.
మీ కవిత లేఖినిలోనే టైప్ చేశారో లేక మరింకేదైనా transliteration tool వాడారో తెలియదు. కాని జ్ఞాపకం అని రాయాలంటే లేఖినిలో టైప్ చెయ్యాల్సిన స్పెల్లింగ్ ఇది : j~naapakam
చాలా బావుంది మీ వనిత గురించి రాసిన కవిత.కలలొ మీ ఊహకు రూపం ఇవ్వండి,నిజంలొ ఆ ఊహకు ప్రాణం పోయండి.